10 August, 2026 | 1:10 PM

పోచమ్మ దేవాలయాల్లో ఘనంగా బోనాల ఉత్సవాలు

10-08-2026 11:44 AM

రామచంద్రపురం ఆగస్టు 10:  రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని వివిధ పోచమ్మ దేవాలయాల్లో బోనాల పండుగ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను అలంకరించి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రామచంద్రాపురం డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్,నరేష్, నవీన్ గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.