28 August, 2026 | 12:58 AM

కదం తొక్కిన కలం సైనికులు

27-08-2026 06:37 PM

కల్లూరు,(విజయక్రాంతి): జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన పాదయాత్ర గురువారం కల్లూరు మండల కేంద్రానికి చేరుకుంది. అంబేద్కర్ విగ్రహానికి టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి. రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి అధికారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పొట్రూ అర్జున్‌రావు మాట్లాడుతూ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.