జర్నలిస్టుల సంక్షేమమే ఐజేయూ లక్ష్యం
మహబూబాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ల క్ష్యంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) ముం దుండి కృషి చేస్తుందని మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్, జాతీ య కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్ అ న్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ని లయన్ క్లబ్ హాల్ లో గురువారం ఐజే యు నూతన సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధన, ఇ తర అంశాలపై మొదటి నుండి టియుడబ్ల్యూజే ఐజేయు క్రియాశీలక పాత్ర పోషి స్తుందని చెప్పారు. ఇదే స్పూర్తితో జిల్లాలో రానున్న రోజుల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రా ష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గంధసిరి రవి, జిల్లా ప్ర ధాన కార్యదర్శి గాడిపళ్లి శ్రీహరి, కోశాధికారి వెంకటరమణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి రంగా చౌదరి, తదితరులు పాల్గొన్నారు.






