12 June, 2026 | 1:24 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ -ఆర్పీఐ (ఎ) ఉమ్మడి వ్యూహం

12-06-2026 12:12 AM

మేయర్ పదవిని దక్కించుకోవడమే లక్ష్యం 

ఆర్పీఐ జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు

ముషీరాబాద్, జూన్  11 (విజయక్రాంతి): రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్(జిహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ-ఏ) కలిసి సంయుక్తంగా పోటీ చేయనున్నట్లు ఆర్పీఐ జాతీయ కార్యదర్శి శివ నాగేశ్వరరావు పేరం తెలిపారు. మేయర్ పదవిని కైవసం చేసుకునే లక్ష్యంతో బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు మిత్రపక్షాల మధ్య ప్రాథమిక అంగీకారం కుదిరిందన్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆయన, దేశ అభివృద్ధిలో మోడీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. అలాగే కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి, ఆర్పీఐ(ఏ) జాతీయ అధ్యక్షుడు రాందాస్ అథవాలే సేవలను కొనియాడారు.

ఈ ఎన్నికల వ్యూహంపై ప్రధాని నరేంద్ర మోడీ, రాందాస్ అథవాలే, నితిన్ నబిన్ లతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావుతో చర్చలు జరిపామని, అందరూ సానుకూలంగా స్పందించారని తెలిపారు. జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి, దానిని ప్రధాని మోడీకి విజయ కానుకగా అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.