టీజీఐఐసీ స్పోర్ట్స్ మీట్‌లో క్యారమ్స్ ఆడిన నిర్మల
సంగారెడ్డి, జూన్ 11 : తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వార్షిక స్పోరట్స్ మీట్ లో రెండో రోజు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ స్పోరట్స్ మీట్ లో రెండో రోజు గురువారం టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఉద్యోగులతో కలిసి ఇండోర్ గేమ్స్ లో పాల్గొన్నారు. బ్యాట్మెంటెన్, క్యారమ్స్ ఆడి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు శుక్రవారం ఐ.ఎస్.బి గచ్చిబౌలిలో బహుమతులను ప్రదానం చేస్తారు. బహుమతుల ప్రదానంతో పాటు టీజిఐఐసి ఉద్యోగులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉద్యోగుల మధ్య ఐక్యత, స్నేహాభావం పెంపొందెందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నిర్మలా జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో టీజిఐఐసి ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






