'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా
22-05-2026 08:51 PM
- లైసెన్స్ లేని 13 మందికి రూ.65వేలు ఫైన్
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 20 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు. న్యాయమూర్తి విచారణ జరిపి 20 మందికి కలిపి రూ.2లక్షల 3 వేల 5 వందల జరిమానా విధించారని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 13 మందికి రూ.65వేలు జరిమానా విధించారని తెలిపారు.






