10 May, 2026 | 12:16 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •  

జ్యోతిష్మతి విద్యార్థులకు ఎమ్మెన్సీ కంపెనీల్లో జాబ్స్

08-06-2025 12:00 AM

క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సాధించిన స్టూడెంట్స్

కరీంనగర్, జూన్ 7 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎమ్మెన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం బీటెక్ నాలుగో సంవత్సరం సీఎస్‌ఈ, సీఎస్‌ఎం చదువుతున్న 12 మంది విద్యార్థులు మల్టీ నేషనల్ కంపెనీలో ఏడాదికి రూ.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు.

ఎస్ శ్రీజ, వై ప్రీతి, ఎస్ విశాఖ, బీ శివాని, పీ మనశ్విని, ఎం శ్రీయ, జుఫీషియఎన్  కుర్షద్, డి అశ్రిత రూ.3.6 లక్షల ప్యాకేజీతో ఇన్ఫోసిస్ కంపెనీలో సిస్టమ్ ఇం జనీర్‌గా ఉద్యోగాలు సాధించారు. బి వర్షిత, బి హరిణి, ఎస్ అక్షిత్, ఎస్ త్రిష వార్షిక వేతనం  రూ.4 లక్షల ప్యాకేజీతో కాగ్నిజెంట్ కంపెనీలో ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీగా ఉద్యోగాలు సాధించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, సెక్రటరీ, కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ అకాడమిక్ డాక్టర్ పీకే వైశాలి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు అభినందించారు.