5 June, 2026 | 9:52 PM

తేజస్ అకాడమీ విద్యార్థులకు డిఫెన్స్ లో ఉద్యోగాలు

05-06-2026 08:45 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం. 156 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీ లో ముగ్గురు (3) విద్యార్థులు ఇండియన్ ఎయిరఫారెస్ లో అగ్నివీరులుగా ఎంపిక కావడం ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు సాధించడం జరిగింది.  జూన్ 2025 హన్మకొండ ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్ సాధించి 31 మే 2026 న వచ్చిన మెరిట్ లో అగ్నివీరులుగా ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. అలాగే 01 జూన్ 2026 న వచ్చిన ఇండియన్ ఎయిరఫోర్స్ మెరిట్ లిస్ట్ లో ముగ్గురు అగ్నివీరులుగా ఎంపిక కావడం ఈ సంధర్బంగా తేజస్ లో  షార్యా 2026" ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను తేజస్ అకాడమీ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు  అభినందించి జ్ఞాపికలు అందించారు