calender_icon.png 11 February, 2026 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికే జాబ్ మేళా

11-02-2026 01:50:04 AM

ఐటీడీఏ పీవో యువరాజ్

ఉట్నూర్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని గిరిజన నిరుద్యో గ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించుటకే రాష్ట్ర రాజధాని లోని 16 కంపెనీ ల యజమానుల తో మాట్లాడి జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్ తెలిపారు. మంగళవా రం ఉట్నూర్ లోని వై.టీ.సీ లో జాబ్ మేళా ను ఆయన ప్రారంభించారు. ఈ మేళాకు హాజరై న నిరుద్యోగ యువతీ యువతులనుదేశించి పీవో మాట్లాడుతూ...

జాబ్ మేళా కార్యక్రమం లో పాల్గొన్న 16 కంపెనీల  నుంచి హాజరైన హెచ్‌ఆర్ డిపార్ట్మెంట్ అధికారులు వారు అడి గే ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు చెప్పి న వారిని ఎంపిక చేస్తారన్నారు. ఎంపికైన వారికి ప్రతినెల రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనాన్ని అందిస్తారని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 312 మందిని నిరుద్యోగు లు హాజరు కాగా, 133 మంది నిరుద్యోగులను ఎంపిక చేశారు. జాబ్ మేళాలో  ఐటిడిఏ పీఓ జనరల్  రఘు, డి.డి అంబాజీ జాదవ్, జిసిసి ఎం.డి  సందీప్ కుమార్, సీఎమ్‌ఓ  జగన్,  జిల్లా మేనేజర్  నాగభూషణం ల తో పాటు అధికారులు, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.