calender_icon.png 11 February, 2026 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిశిత కాలేజీలో జాబ్ మేళా

11-02-2026 02:09:24 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): నిజామాబాద్‌లోని నిశిత అటానమస్ డిగ్రీ కాలేజీలో మంగళవారం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న, 2026 పాస్ అవుట్ విద్యార్థులకు మెగా జాబ్ మేళ నిర్వహించారు. దీనికి జిల్లాలోని అన్ని కళాశాలల నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్‌లో టీసీఎస్ ఐవోఎన్, టెక్ మహీంద్ర, 24/7, ఫోకోన్‌తో పాటు 11 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి.

మేళాకు 600 పైగా విద్యార్థులు హాజరుకగా 486 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపి కయ్యారు. ఎంపికైన విద్యార్థులందరికి నియామకపత్రాలు అందజేశారు. కంపెనీ ప్రతినిధులను కళాశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ నిశిత డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ డా.స్వప్న, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సునంద, అధ్యా పక బృందం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. కాగా ఈ నెల 13న టీసీఎస్ డ్రైవ్ డిగ్రీ 2025 పాన్ అవుట్ విద్యార్థుల కోసం నిర్వహించబడుతుంది. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాలేజీ యాజమాన్యం కోరింది.