19 June, 2026 | 10:02 PM

ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలి

19-06-2026 08:42 PM

అర్మూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు విద్యను సద్వినియోగం చేసుకోవాలని రోటరీ 3150 డిస్టిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్.వి. రాంప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం జక్రాంపల్లి మండలం తొర్లికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండలో రోటరీ క్లబ్ మొయినాబాద్, ఆర్మూర్ రోటరీ క్లబ్, గట్టుమీది రాంరెడ్డి, మంజీత్ రెడ్డి ల సహకారంతో 12 లక్షల నిధులతో నిర్మించిన మరుగుదొడ్లను డిస్ట్రిక్ట్ 3150 ఎలెక్ట్ గవర్నర్ ఉదయ్ పిలాని, మాజీ డిస్టక్ట్ గవర్నర్లు గౌతమ్, హన్మంత్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునాతన సౌకర్యాలతో నిర్మించిన మరుగుదొడ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని టాయిలెట్స్ బ్లాక్‌ను నిర్మించడం జరిగిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోటరీ సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి విద్యారంగానికి సహకారం అందిస్తామని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్ మాట్లాడుతూ రోటరీ క్లబ్,  దాతల సహకారంతో తొర్లికొండ పాఠశాల అభివృద్ధి చేయడం అభినందనీయమని అన్నారు. ఎంఈవో ఎం.శ్రీనివాస్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇందుకు సహకరించిన దాతలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ కాంతి గంగారెడ్డి, ఆర్మూర్ రోటరీ అధ్యక్షులు జక్కుల రాధాకృష్ణన్, కార్యదర్శి  ఖాందేశ్ సత్యం, కోశాధికారి కోట నరేష్, రోటరీ పాస్ట్ ప్రెసిడెంట్ రజినీష్ కిరాడ్,  చంద్రసేన్ రెడ్డి, రాస ఆనంద్, విజయసారథి, చరణ్ రెడ్డి, పుష్పాకర్ రావు, మానస గణేష్, లింబాద్రి, సొసైటీ చైర్మన్ కాటిపల్లి నర్సారెడ్డి, గ్రామ  సర్పంచ్ కాటిపల్లి పద్మ, ఉప సర్పంచ్ తెడ్డు మహిపాల్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్ గౌడ్, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు సాయిలు, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.