25 March, 2026 | 1:13 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి

25-03-2026 11:28 AM

హైదరాబాద్: ఇవాళ్లితో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెంచుకోవడం జరుగుతోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి(Jeevan Reddy Resigns) తెలిపారు. మంత్రులు జీవన్ రెడ్డిని బుజ్జగించిన ఆయన తగ్గలేదు. ఇకపై తనది పోరాట బాట అన్నారు. గ్రామాలకు వెళ్తూ ప్రజల అభిప్రాయం తీసుకుంటానని సూచించారు. ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. 20 నెలలుగా మానిసిక వేదనకు గురయ్యానని చెప్పారు.

తన మానసిక క్షోభకు తెరదించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. గౌరవం లేని చోట ఎందుకు కొనసాగాలన్నారు. సంజయ్ కాంగ్రెస్ లో చేరిప్పుడే రాజీనామా చేయాలనుకున్నానని వివరించారు. మంచి మెజార్టీ ఉన్నా ఫిరాయింపులు చేయడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం లేకుండా అది జరగదన్నారు. రాహుల్ ఆలోచనలకు భిన్నంగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తాయని వెల్లడించారు.