22 April, 2026 | 7:10 AM

జీవన్‌రెడ్డి పెద్ద ప్యూడలిస్టు

22-04-2026 12:44 AM

పీసీసీ ఎస్సీసెల్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ    

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): జీవన్‌రెడ్డి పెద్ద ప్యూడల్ అని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యాక కనీసం ప్రెస్‌మీట్ కూడా  పెట్టనివ్వలేదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు.  మంగళవారం కవ్వంపల్లి సీఎల్పీ కార్యాలయంలో మీడియతో మాట్లాడారు.   కాంగ్రెస్‌ని, సీఎం రేవంత్ రెడ్డిపైన మాట్లాడితే సహించబోమన్నారు.  కాగా ఎస్సీ సెల్ కమిటీని రద్దు చేస్తున్నామని, త్వరలో కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుంటామని కవ్వంపల్లి   చెప్పారు.