21 March, 2026 | 8:01 PM

జసుహార్థ్ శక్తి ఫోరం-2026

20-03-2026 12:00 AM

ఈ థేమ్స్ బిజినెస్ స్కూల్‌లో నిర్వహణ

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): సుహార్థ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈ థేమ్స్ బిజినెస్ స్కూల్‌లో నిర్వహించిన జసుహార్థ్ శక్తి ఫోరం 2026 మాసిక పరిశుభ్రతపై అవగాహన, అందుబాటు, అడ్వకసీపై దృష్టి సారించింది. ఫౌండర్ హితేషి దత్త సంస్థ ఏడాది సేవలను వివరించగా, 1.5 లక్షల ఆర్గానిక్ ప్యాడ్ల పం పిణీ, వేలాది బాలికలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన జయేష్ రంజన్ ప్రభుత్వ సహకారం అవసరాన్ని ప్రస్తావించారు.

డా. శివరంజని తక్కు వ ఖర్చుతో పర్యావరణహిత ప్యాడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పద్మశ్రీ డా. మంజుల అనగాని “నో ప్లాస్టిక్ ప్యాడ్స్‌” అవసరాన్ని వివరించారు. నటి ఈషా రెబ్బా ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. అభిలాష బిష్ట్, కరుణ గోపాల్, సుప్రీంకోర్టు న్యాయవాది నెరెల్ల మాల్యాద్రి, డా. బి. ఎబెనేజర్, ఉషా పాలియత్, బ్రిగేడియర్ ఇండర్ సేథి, జోగిందర్ తనికెల్ల, అనుపమ దాల్మి యా, చిన్మయీ తమ్మారెడ్డి, ఉమారావు, ప్రొఫెసర్ కృష్ణ చైతన్య, ప్రొఫెసర్ సత్య కిరణ్ శాస్త్రి, డా. అంకిత చావ్లా, డా. సరీతా శ్రీవాస్తవ, డా. మేఘనా రామరాజు, డా. సంగీతా ఉప్పల, డా. నితిన్ చావ్లా తదితర నిపుణులు పాల్గొన్నారు.