26 May, 2026 | 4:25 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కిన ఎమ్మెల్యే కొడుకు

03-01-2026 04:53 PM

హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో శనివారం నాడు ఈగల్‌ టీమ్ తనిఖీలు నిర్వహించింది. జమ్మలమడుగు(Jammalamadugu MLA) భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ పరీక్షల్లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు డీఅడిక్షన్ సెంటర్ కు తరలించారు. సుధీర్‌రెడ్డితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.