3 July, 2026 | 11:04 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

దసరాకు జైలర్ 2

03-07-2026 12:00 AM

రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్2’. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. వీళ్లిద్దరి కలయికలో విజయవంతమైన ‘జైలర్’ మూవీకి సీక్వెల్ ఇది. కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. దసరా కానుకగా అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్ పిక్చర్స్ వీడియోను పంచుకుంది.

తొలిభాగం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే సీక్వెల్ ప్రారంభమవుతుందని తాజాగా విడుదల చేసిన వీడియోను బట్టి అర్థం అర్థమవుతోంది. ‘జైలర్’తో పోలిస్తే, ఇందులో పాత్రలు మరింత బలంగా ఉండేలా కనిపిస్తున్నాయి. తొలి భాగంలో కనిపించినవారితోపాటు, కొత్తవారు కూడా ఈసారి థ్రిల్ పంచనున్నారు.

మరి ముత్తువేల్ పాండియన్‌ను ఎదురయ్యే సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు? విగ్రహాల స్మగ్లింగ్ నెట్వర్క్‌ను ఎలా కనిపెట్టాడు? తన కుటుంబానికి ఆపద రాకుండా ఎలాంటి ప్లాన్ వేశాడు? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉండనున్నాయి.