26 July, 2026 | 2:12 AM

ఫెర్టీ9లో ఐవీఎఫ్ దినోత్సవం

26-07-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్‌లోని స్థానిక ఫెర్టీ9 నందు శనివారం వేడుకలు జరుపుకున్నారు. డాక్టర్ బిజిబి పిళ్లై, డాక్టర్ మీనాశ్రీ  సంయుక్తంగా మాట్లాడుతూ.. ఫెర్టీ9 క్లినికల్ కరీంనగర్ బృందం ప్రపంచ ప్రఖ్యాత సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచింది అన్నారు.

ప్రస్తుత జీవనశైలిలో మార్పులు ఒత్తిడి, ఆలస్య వివాహాలు, ఉద్యోగ పరిస్థితులు, పురుషులు, మహిళల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి అన్నారు. దంపతులు ఆలస్యం చేయకుండా ప్రారంభ దశలోని పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన చికిత్స పొందడం ముఖ్యమన్నారు. ఫెర్టీ9 కరీంనగర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యధిక ఫెర్టిలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.