9 August, 2026 | 2:08 AM

నేర్చుకునే తత్వమే నన్ను దర్శకుడిని చేసింది

09-08-2026 12:55 AM

డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుం టాం కానీ డాక్టర్ రవికిరణ్ గడలాయ్ ఎండీ, పాథాలజిస్ట్ డాక్టర్‌గా తన వృత్తిలో గుర్తింపు తెచ్చుకొని, ఇప్పుడు దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. శ్రీరామ్ (శ్రీకాంత్) హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ కథతో ‘ది మేజ్‘ చిత్రాన్ని తన తొలి ప్రయత్నంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రవికిరణ్ గడలాయ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ తన గురించి పలు విశేషాలు పంచుకున్నారు. “నేను ఎక్కడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయలేదు. చిన్నప్పటి నుంచే ఒక సినిమా తీయాలనే కల ఉండేది. ఎన్నో సినిమాలు చూస్తూ, వాటిని విశ్లేషిస్తూ, నా మొబైల్‌తోనే ప్రాక్టీస్ చేస్తూ సినిమా భాషను నేర్చుకున్నా.

ఎడిటింగ్‌పై ఉన్న అవగాహన వల్ల ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఊహించుకోగలిగాను. అదే దర్శకత్వాన్ని నాకు మరింత సులభం చేసింది. ఫిలిం మేకింగ్‌లో దర్శకులు అకిరా కురోసావా, సెల్వరాఘవన్, సందీప్ రెడ్డి వంగా నాకు స్ఫూర్తినిస్తుంటారు” అన్నారు.

ఈ మూవీలో ప్రియాంక, హృతిక శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయి, డాక్టర్ కరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ భరత్‌రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్; డీవోపీ: శివకృష్ణ; ఎడిటర్: సత్య గిడుతూరి; ఆర్ట్: రాజు అడ్డాల.