పంటల ప్రణాళికకు దిక్సూచిగా ఉండాలి
- వ్యవసాయాన్ని శాటిలైట్ డేటా ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలి
- వ్యవసాయాధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శాటిలైట్ మ్యాపింగ్ చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం సచివాలయంలో ఉపగ్రహ ఆధారిత పంట మ్యాపింగ్ (శాటిలైట్ క్రాప్ మ్యాపింగ్)పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ యూనివర్సిటీ,
వ్యవసా యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫె సర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసా య విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన శాటిలైట్ డేటా ఆధారంగా సేకరించిన వివరాలను మంత్రికి వివరించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాలవారీగా పంటల విస్తీ ర్ణం, వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్ డేటాలో ఉన్న స్వల్ప తేడాలను వివరించారు.
అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ పంటల సమగ్ర ప్రణాళికకు ఉపగ్రహ ఇమేజింగ్ ఒక దిక్సూచిగా ఉండాలని ఆదేశిం చారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని శాటిలైట్ డేటా ఆధారంగా ముం దుకు తీసుకెళ్లడం అత్యవసరమన్నారు. మార్కెటింగ్, డిమాండ్ అంచనా, ఉత్పత్తి, సరఫరా వ్యవ స్థ, గిడ్డంగి సదుపాయాలు, పంట నష్టాల అంచనా, పంట బీమా వంటి అంశాలు పరస్పరం అనుసంధానమై ఉం టాయని, వీటన్నింటినీ సమన్వయం చేయడంలో ఉపగ్రహ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఉపగ్రహ మ్యాపింగ్ ద్వారా ప్రతి సీజన్‌లో రైతులకు సమయానుకూల సూచనలు అం దించడం, వ్యవసాయ శాఖ చర్యలను వేగవంతం చేయడం సులభమవుతుందన్నారు. భారీ వర్షాలు, వరదలు, కరువు వంటి ప్రకృ తి విపత్తుల వల్ల పంటలకు కలిగే నష్టాలను త్వరితగతిన గుర్తించి ప్రభుత్వానికి చేరవేయడం ద్వారా సహాయక చర్యలను వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. పంట నష్టాల అంచనాలు ఖచ్చితం గా లభించడం వల్ల నష్ట పరిహార అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు.




