23 March, 2026 | 8:47 AM

ఆర్థిక స్తోమత లేని వారికి సీఎంఆర్‌ఎఫ్ పథకాన్ని అందించడం నా బాధ్యత

23-03-2026 12:29 AM

నాగారం కలెక్టరేట్ వద్ద నిర్మించి ఉన్న ఇళ్లను పేదలకు పంపిణీ చేయడమే నా ధ్యేయం 

అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా

నిజామాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు పడుతూ వైద్యం పొందలేని వారికి సీఎంఆర్‌ఎఫ్ పథకం ద్వారా వైద్య ఖర్చుల చెక్కులు అందించడం తన బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ ని ఆయన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎంఆర్‌ఎఫ్ సహాయం అందేలా తను తప్పనిస రిగా చర్యలు తీసుకుంటా అన్నారు. దరఖాస్తు విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన బృందం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు దరఖాస్తు దారులు నేరుగా తన కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

దరఖాస్తు చేసుకున్న అర్హుల జాబితాను ఖచ్చితంగా సెక్రటేరియట్ కు పంపించడం జరుగుతుందన్నారు. దరఖాస్తు మొత్తంలో వీలైనంత ఎక్కువగా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని చెప్పారు. కాగా మొత్తం 185 మందికి రూ.56, 20,500 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.       

నాగారంలో గల 396 ఇల్లు,కలెక్టరేట్ సమీపంలో మరో 200 ఇల్లు ఉన్నాయన్నారు. వీటిని నిర్మించి ఏళ్లు గడిచిందని వాటి కిటికీలు, తలుపులు చోరీకి గురవుతున్నాయని తెలిపారు. ఈ విషయమై అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అంతేకాకుండా  అసెంబ్లీలో కూడా ప్రస్తావించానని ఆయన పేర్కొన్నారు.  నాగారంలో గల 396 ఇల్లు,కలెక్టరేట్ సమీపంలో మరో 200 ఇల్లు ఉన్నాయన్నారు. వీటిని నిర్మించి ఏళ్లు గడిచిందని వాటి కిటికీలు, తలుపులు చోరీకి గురవుతున్నాయని తెలిపారు.

ఈ విషయమై అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి దృష్టికి తెచ్చి వాటిని లబ్ధిదారులకు అందించడమే తన చేయమని, అంతేకాకుండా  అసెంబ్లీలో కూడా ప్రస్తావించాన ని పేర్కొన్నారు.   గడిచిన నాలుగేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నియోజకవర్గంలో ఒకటి కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు.  కార్పొరేటర్లు జగదీష్ కులకర్ణి, మఠం పవన్, చింతకాయల రాజేందర్, ఇప్పకాయల కిషోర్, దాంపల్లి జ్యోతి మురళి, బొబ్బిలి సుమిత్ర వేణు,  కలిపే అర్చన చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీణ్, బిజెపి నాయకులు బద్దంకిషన్, పుట్ట వీరేందర్  పాల్గొన్నారు.