పంజాబ్ కింగ్స్‌కు ఎదురుందా?
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : ఐపీఎల్ 19వ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడబోతోంది. ఇప్ప టి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని పంజాబ్ కింగ్స్ ఆరు మ్యాచ్ లలో ఐదు విజయాలతో ఒక మ్యాచ్ వర్షంతో రద్దవగా 11 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
గత సీజన్‌లో రన్నరప్‌తో సరిపె ట్టుకున్న ఆ జట్టు ఈ సారి ఎలాగైనా టైటిల్ ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో అస్సలు తగ్గేదే లేదన్నట్టుగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ దూసుకెళుతోంది. పంజాబ్ కు అతిపెద్ద అడ్వాంటేజ్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీనే. ఏ టీమ్‌కు ఆడినా తనదైన వ్యూహాలతో జట్టును సక్సెస్ ఫుల్‌గా నడిపించే సత్తా అతని సొంతం. గత సీజన్ తరహాలోనే ఈ సారి కూడా పంజాబ్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు.
అంతేకాదు వ్యక్తిగతంగానూ రాణి స్తున్నాడు. పంజాబ్ బ్యాటింగ్‌లో ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శశాంక్ సింగ్, స్టోయినిస్ అదరగొడుతున్నారు. మిఛెల్ ఓవెన్ కూడా వీరికి జత కలిస్తే ఇక తిరుగుండదు. బౌలింగ్‌లోనూ పంజాబ్ నిలకడగా రాణిస్తోంది. మార్కో జెన్సన్ , బార్ లెట్ తో పాటు విజయ్ కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్ పేస్ ఎటాక్‌లో అదరగొడుతున్నారు. స్పిన్ విభాగంలో చాహల్ పంజాబ్‌కు ప్లస్ పాయింట్. ప్రతీ మ్యాచ్‌లో బౌలర్లు కలిసికట్టుగా రాణిస్తుండడం పంజాబ్ వరుస విజ యాలకు కారణంగా చెప్పొచ్చు.
మరోవైపు ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన పడు తూ లేస్తూ సాగుతోంది. ఆరంభంలో వరుసగా రెండు విజయాలతో అదరగొట్టిన ఢిల్లీ తర్వాత రెండు ఓటములతో డీలా పడింది. మళ్లీ ఆర్సీబీ లాంటి జట్టుపై గెలిచిన ఆ జట్టు తర్వాత సన్ రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానం లో కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫామ్ లో ఉన్న పంజాబ్ ను ఎదుర్కోవడం సవా లే. నిస్సాంక నిలకడలేమి ఇబ్బందిగా మా రింది.
కేఎల్ రాహుల్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వీ స్థాయికి తగినట్టు రాణిస్తే భారీస్కోరు చేయొచ్చు. డేవిడ్ మిల్లర్, స్టబ్స్ కూడా ఫినిషర్ రోల్స్‌లో కీలకంగా చెప్పొచ్చు. బౌలింగ్ పరంగా మిఛెల్ స్టార్క్ లేకపోవడం కాస్త ఇబ్బందిగానే ఉంది. ఎంగిడి, నటరాజన్, ముకేశ్ కుమార్ పేస్ ఎటాక్‌ను నడిపిస్తుండగా.. స్పిన్ విభాగంలో కుల్దీప్, అక్షర్ ఇంకా మెరుగ్గా రాణించాల్సి అవసరం ఉంది. మ్యా చ్‌కు ఆతిథ్యమిస్తున్న అరుణ్ జైట్లీ స్టేడియం చిన్న బౌండరీలు, ఫాస్ట్ ఔట్ ఫీల్ కారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
తుది జట్లు అంచనా
ఢిల్లీ క్యాపిటల్స్ : నిస్సాంక, కేఎల్ రాహుల్, నితీశ్ రాణా, రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), మిల్లర్, స్టబ్స్, ఎంగిడి, కుల్దీప్, నటరాజన్, ముకేశ్ కుమార్
పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, మిఛెల్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, స్టోయినిస్, మార్కో జెన్సన్, బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్షదీప్, చాహల్






