19 April, 2026 | 3:03 AM

పంజాబ్ కింగ్స్‌కు ఎదురుందా?

19-04-2026 01:09 AM

లక్నో జట్టుకు అగ్నిపరీక్ష

ముల్లాన్‌పూర్, ఏప్రిల్ 18 : ఐపీఎల్ 19వ సీజన్ లో దుమ్మురేపుతున్న పంజాబ్ కింగ్స్ మరో కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. ముల్లాన్ పూర్ వేదికగా ఆదివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడిన పంజాబ్ ఒక్క ఓటమి లేకుండా 9 పాయిం ట్ల అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ, కీలక బ్యాటర్లందరూ ఫామ్ లో ఉండడం పంజాబ్ కు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. 

ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య సూపర్ మెరుపు ఆరంభాలను ఇస్తుండగా.. శ్రేయాస్ అయ్యర్ సూపర్ ఫామ్ తో చెలరేగిపోతున్నాడు. అటు టీమ్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ, ఇటు వ్యక్తిగతంగానూ దుమ్మురేపుతున్నాడు. బౌలింగ్ లో కూడా పంజాబ్ కలిసికట్టుగా రాణిస్తోంది.  మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి ఒత్తిడిలో ఉంది. వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఐదు మ్యాచ్ లలో కేవలం రెండు విజయాలే సాధించిన లక్నో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ రిషబ్ పంత్ వైఫల్యం లక్నోకు ప్రధాన సమస్యగా మారింది.

సారిథిగానూ, అటు వ్యక్గితంగానూ నిరాశపరుస్తు న్నాడు. పంత్ ఫామ్ లోకి వస్తే తప్ప లక్నో గెలుపు బాట పట్టేలా లేదు. అలాగే ఓపెనర్లు మార్ష్, మార్కరమ్ ఇంకా పూర్తిస్థాయి అందుకోలేకపోవడం మైనస్ గా మారింది. అబ్దుల్ సమద్ కూడా చెప్పుకోదగిన ఇన్నిం గ్స్ ఆడలేదు. ఇటు ముకుల్ చౌదరీ కూడా కీలకంగా చెప్పొచ్చు బౌలింగ్‌లో అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రతి, ప్రిన్స్ యాదవ్, జార్జ్ లిండేపై అంచనాలున్నాయి.