26 May, 2026 | 4:25 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

అన్నయ్యనా..! బావగారా?

27-03-2026 12:13 AM

టాలీవుడ్ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ భార్య అన్నా లెజి నోవా ఇన్‌స్టాలో పంచుకున్న ఓ పోస్టర్ వైరల్‌గా మారింది. ఆమె ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఎంతో కాలంగా ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నానని.. ఇప్పుడు సరైన సమయం వచ్చిందని అందుకే ఓపెన్ చేసినట్లు ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఇదిలావుండగా, అన్నా లెజి నోవా తాజాగా పవన్‌కల్యాణ్ సోదరులు చిరంజీవి, నాగబాబులతో తన అనుబంధాన్ని పంచుకున్నారు.

‘అన్నయ్యనా.. బావగారా?’ అంటూ వారిద్దరితో దిగిన ఫొటోలకు ఆసక్తికరమైన వ్యాఖ్యలను జోడించారు. ‘ఒకరి పై ఒకరు ఎప్పుడూ ప్రేమానురాగాలు చూపిస్తూ ఉండే ఈ మెగా కుటుంబంలోకి దాదాపు 15 ఏళ్ల క్రితం అడుగుపెట్టాను. వచ్చి న కొత్తల్లో ఇక్కడ ఎలా ఉండాలో.. ఎవరిని ఎలా పిలవాలో అర్థం కాలేదు. దీంతో నా భర్త (పవన్‌కల్యాణ్) వాళ్లను ఎలా పిలుస్తున్నారో గమనించి.. నేనూ అలానే పిలిచేదాన్ని.

చిరంజీవిని అన్నయ్య అని, నాగబాబును చిన్నన్నయ్య అని అనేదాన్ని. మొదట మామూలుగా అన్నయ్య అని పిలిచా.. కానీ, ఆ తర్వాతే ఆ బంధం గొప్పతనం అర్థమైంది. తర్వాత నేను ‘బావ గారు’ అని పిలవడం నేర్చుకొన్నా. నాకు అన్నదమ్ములు లేరు.. కానీ, ఈ బంధం నాకు చిరంజీవి, నాగబాబుల రూపంలో ఇద్దరు సోదరులను ఇచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చేసిన గంట లోపే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.