3 July, 2026 | 1:38 AM

బోడు ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఆర్జేడీ

03-07-2026 12:44 AM

టేకులపల్లి, జులై 2 (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (RJౄ) మదన్ మోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి (ౄEO) వాసంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా డీఈఓ వాసంతి తరగతి గదులను సందర్శించి, ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు.

విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. బోధనను మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులకు విలువైన సూచనలు అందించారు.  విద్యార్థులకు కూడా చదువులో మరింత పురోగతి సాధించేలా పలు సూచనలు చేశారు. ఆర్జేడీ మదన్ మోహన్ తెలంగాణ పబ్లిక్ స్కూల్గా అభివృద్ధి చెందనున్న జడ్పీహెచ్‌ఎస్ బోడు పాఠశాలను సందర్శించి, పాఠశాలలోని భౌతిక వసతులు, మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించారు.

పాఠశాల అభివృద్ధికి అవసరమైన అంశాలపై ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్‌ఎస్ బోడు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అజ్మేరా జగన్ పాఠశాల అభివృద్ధికి సంబంధించిన విషయాలు గ్రామస్తులతో కలిసి వివరించారు. ఈ కార్యక్రమంలో బోడు గ్రామానికి చెందిన ప్రముఖులు శేఖర్, వీరభద్రం, రవి, శ్రీనివాస్, సైదులు, బాలాజీ తదితరులు పాల్గొని పాఠశాల అభివృద్ధి, గ్రామ సహకారం  అందుబాటులో ఉన్న వనరుల గురించి తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేశారు.