15 August, 2026 | 2:42 AM

త్వరలో భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు

15-08-2026 01:25 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఇరాన్ అధ్యక్షుడు మసూ ద్ పెజిష్కియాన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ అధ్యక్షతన జరిగే అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన నుండ డం కీలకంగా మారింది.  అక్టోబర్ 2024లో రష్యా లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో ఇరాన్ అధ్యక్షుడు భేటీ అయ్యా రు.

ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. గతేడా ది బ్రెజిల్ వేదికగా ఈ సదస్సు జరగగా.. అనంతరం ఈ ఏడాది అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. బ్రిక్స్ కూటమిలో 2024లో ఇరాన్తోపాటు ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ, గతేడాది ఇండోనేసియా దేశా లు చేరాయి.దీంతో ప్రస్తు తం పూర్తిస్థాయి సభ్యదేశాల సంఖ్య 11కు చేరింది.