దద్దరిల్లిన ఇరాన్
- టెహ్రాన్, లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
- నబాటియే ప్రావిన్స్‌లో ఏడుగురు మృతి
- ఇరాన్ వైద్య పరిశోధనా కేంద్రంపై అమెరికా దాడి
- 19 క్షిపణులను, 26 డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ
- గల్ఫ్‌లోని అమెరికా లోహ కర్మాగారాలపై ఇరాన్ దాడి
- హార్ముజ్ కోసం రంగంలోకి భారత్‌తో సహా 35 దేశాలు!
- యుద్ధాన్ని ఆపేది లేదన్న ఇరాన్
టెహ్రాన్/బీరుట్/రియాద్/అబుదాబీ, ఏప్రిల్2: అమెరికా ఇరాన్ యు ద్ధం రోజురోజుకూ భీకరంగా మారుతోంది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు 34 రోజైన గురువారం కూడా కొనసాగాయి. ఇరాన్‌లోని మధ్యప్రాచ్యంలోనే అత్యంత ఎత్తున వంతెనపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఇరాన్‌పై అమెరికా గగనతల ప్రవేశానికి ఆస్ట్రియా నిరాకరించింది.
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. లెబనాన్‌లో 600 మంది భారత సైనికులు మోహరించారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అంతేకాకుండా ఇరాన్ నుంచి 204 మంది భారతీయులు స్వదేశానికి వస్తున్నారని ఆయన వెల్లడించారు. యూఏఈ 19 క్షిపణులను, 26 డ్రోన్లను కూల్చివేసింది. గల్ఫ్‌లోని అమెరికా లోహ కర్మాగారాలపై ఇరాన్ దాడి చేసింది.
లెబనాన్‌లోని నబాటియే ప్రావిన్స్‌లో మున్సిపల్ అధికారితో సహా 7 మంది మృతి చెందారు. శతాబ్దాల నాటి ఆరోగ్య సంస్థపై అమెరికా దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. టెహ్రాన్‌లో ఐఆర్‌జీసీపై ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది. అమెరికా-,ఇజ్రాయెల్ దాడుల్లో టెహ్రాన్‌లో 33,000 ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
అమెరికా. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం వల్ల మధ్య ఆసియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌లోని అత్యం త్య ఎత్తున హైవే వంతెనపై దాడిలో మరణాలు సంభవించినట్లు ఇరాన్ వెల్లడించింది. అల్ జజీరా కథనం ప్రకారం, టెహ్రాన్‌కు పశ్చిమ నగరమైన కరాజ్‌తో కలిపే హైవే వంతెనపై జరిగిన దాడిలో కనీసం ఇద్దరు మరణించారు. అల్బోర్జ్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మాట్లాడుతూ, పలువురు గాయపడ్డారని, వారిని చికిత్స కోసం వైద్య కేంద్రాలకు తరలించారని ఇస్నా(ఐఎస్‌ఎన్‌ఏ) వార్తా సంస్థ పేర్కొంది.
ఈ దాడి వల్ల విద్యుత్, నీటి సరఫరా లేదా పర్యావరణానికి ఎలాంటి అంతరాయం కలగలేదని ఆ అధికారి తెలిపారు. ఇంకోపక్క లెబనాన్‌లో 600 మంది భారత సైనికులు మోహరించారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపిం ది. ప్రస్తుతం లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం (యూనిఫిల్)లో సుమారు 600 మంది భారత సైనికులు సేవలందిస్తున్నారని, మరికొందరు రాబోయే కొద్ది రోజు ల్లో తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ తరలింపునకు సహకరించినందుకు ఆయన అజర్ బైజాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
మరోపక్క యూఏఈ 19 క్షిపణులను, 26 డ్రోన్లను కూల్చివేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన వాయు రక్షణ వ్యవస్థలు గురువారం 19 బాలిస్టిక్ క్షిపణులను, 26 డ్రోన్లను అడ్డుకున్నాయని ‘ఎక్స్’లో రక్షణ మంత్రిత్వశాఖ తెలిపిం ది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,038 డ్రోన్లను, 19 క్రూయిజ్ క్షిపణులను, 457 బాలిస్టిక్ క్షిపణులను నమో దు చేసి, తిప్పికొట్టినట్లు కూడా పేర్కొంది.
ఇదిలా ఉండగా అమెరికాతో పోరాటానికి 70 లక్షల మంది ఇరానీయులు సిద్ధంగా ఉన్నారని టెహ్రాన్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు. అమెరికా భూతల దండయాత్ర జరిగితే, సుమారు 70 లక్షల మంది ఇరానీయులు పోరాటానికి సిద్ధంగా ఉన్నారని స్పీకర్ మహ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇంకోపక్క ఇరాన్ నైరుతి ఖుజెస్తాన్ ప్రావిన్స్ అంతటా పలు దాడులు జరిగినట్లు డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారని మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మినూ ద్వీపంపై దాడులు జరగగా, ఖొర్రమ్షహర్, అబాదాన్ నగరాల్లో రెండేసి దాడులు జరిగాయి.
అక్కడ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించాయి. ఇదిలా ఉండగా గల్ఫ్‌లోని అమెరికా లోహ కర్మాగారాలపై ఇరాన్ దాడి చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికాతో సంబంధం ఉన్న ఉక్కు, అల్యూమినియం కర్మాగారాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ రివల్యూషనరీ గాడ్స్ తెలిపారు. మరోపక్క లెబనాన్‌లో నబాటియే ప్రావిన్స్‌లో నాలుగు అంతస్తుల నివాస భవనంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మున్సిపల్ అధికారితో సహా ఏడుగురు మృతి చెందారు. ఇంకోపక్క శతాబ్దాల నాటి ఆరోగ్య సంస్థపై అమెరికా దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది.
టెహ్రాన్‌లో ఐఆర్‌జీసీపై ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది. బుధవారం టెహ్రాన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ గార్డ్ కారప్స్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడిందని అల్-జజీరా పేర్కొంది. ఈ దాడుల్లో టెహ్రాన్‌లోని ఐఆర్‌జీసీ భూతల దళ స్థావరం కూడా ఉంది. ఇంకోపక్క ఇరాన్‌లోని ఖుజెస్తాన్ ఉక్కు కర్మాగారం మరమ్మతులకు ఏడాది పట్టవచ్చని డిప్యూటీ డైరెక్టర్ మెహ్రాన్ పాక్బిన్ చెప్పారు.
టెహ్రాన్‌లో 33,000 ఇళ్లు ధ్వంసం
మరోపక్క అమెరికా- దాడుల్లో టెహ్రాన్‌లో 33,000 ఇళ్లు ధ్వంసం అయ్యాయని టెహ్రాన్ మేయర్ ప్రతినిధి అబ్డోల్మో హర్ మొహ్మద్‌ఖానీ తెలిపారు. మరోపక్క వైమానిక దాడిలో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రికి గాయాలయ్యాయి. ఆయన భార్య మృతి చెందింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రాకెట్ దాడులు కొనసాగుతుండగా, రాకెట్ శకలాలు తగిలి ఇద్దరు గాయపడ్డారు.
మరో పక్క ఒక్క గంటలో 4 డ్రోన్లను సౌదీ అరేబియా అడ్డుకుని వాటిని ధ్వంసం చేసిందని అధికారులు తెలిపారు. అమెరికా స్థావరాలపై 41 దాడులు చేశామని ఇరాకీ సాయుధ బృందం ఆరోపించింది. ఇరాక్‌లోని షియా పాపులర్ మొబి లైజేషన్ ఫోర్సెస్ స్థావరంపై జరిగిన వైమానిక దాడుల్లో ముగ్గురు యోధులు మృతి చెందారు.
యుద్ధాన్ని ఆపేది లేదు : ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ భారీ హెచ్చరిక జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేది లేదని స్పష్టం చేసింది. అమెరికా బెదిరింపులకు లొంగబోమని తెలిపింది. యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రకరకాల ప్రకటనలు చేస్తున్న వేళ ఇరాన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు ఇండియాలోని ఇరాన్ ఎంబసీ తన సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేసింది.
ఇరాన్‌తో యుద్ధంపై బుధవారం రాత్రి ట్రంప్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ మిలిటరీ మాత్రం ట్రంప్ ప్రకటనకు ధీటుగా స్పందించింది. అమెరికాకు తీవ్ర అవమానం జరిగే వరకు యుద్ధాన్ని వదలేది లేదని, అమెరికా పశ్చాత్తాప పడి, లొంగిపోయే వరకు తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇరాన్ మిలిటరీకి నష్టం జరిగిందన్న అమెరికా ఆరోపణల్ని కూడా ఆ దేశం ఖండించింది.
హోర్ముజ్ కోసం రంగంలోకి భారత్‌తో సహా 35 దేశాలు!
ఇరాన్‌పై అమెరికా ఉమ్మడిగా ప్రారంభించిన యుద్ధం 34 రోజులకు చేరింది. అయినా ఇప్పటికీ ఇరాన్ ప్రతిఘటన ఆగడం లేదు. అదే సమయంలో అమెరికా పై ప్రపంచ దేశాల ఒత్తిడి పెంచే లక్ష్యంతో కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు మండుతున్నాయి. దీంతో అమెరికాకు ప్రత్యామ్నాయంగా మరో పెద్దన్న బ్రిటన్ హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ఏకంగా 35 దేశాల కూటమిని ఏర్పాటు చేసింది.
ఇందులో చేరాలని భారత్‌ను కూడా ఆహ్వానించింది. గురువారం బ్రిటన్ నేతృత్వంలో 35 దేశాల ప్రతినిధులు హార్ముజ్ జలసంధిని తెరిపించే విషయంలో చర్చించేందుకు సమావేశమయ్యాయి. ఈ భేటీలో పాల్గొనాలని నిర్ణయించిన భారత్.. తమ ప్రతినిధిగా విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీని పంపామని విదేశాంగశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ధృవీకరించారు. షిప్పింగ్ మార్గాలను తెరిచి ఉంచడానికి భారతదేశం కూడా ఇరాన్‌తో సహా ప్రాంతీయ దేశాలతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.




