1 April, 2026 | 4:24 AM

కువైట్ చమురు నౌకపై ఇరాన్ దాడి

01-04-2026 12:51 AM
  1. భారీ ఎత్తున చెలరేగిన మంటలు.. 24 మంది సిబ్బంది సురక్షితం

సముద్ర జలాల్లో చమురు కలిసే ప్రమాదంపై ఆందోళన

కువైట్: గల్ప్ దేశాలపై ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. కువైట్‌కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై భారీ దాడి చేసింది. ఈ దాడిని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ధృవీకరించింది. దుబాయ్ పోర్టు వద్ద ఉన్న ‘అల్ సల్మీ’ అనే భారీ ముడిచమురు నౌకపై ఇరాన్ డ్రోన్‌తో దాడికి దిగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఇందులో ఉన్న 24 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికార వర్గాలు ధృవీకరించాయి.

కాగా దాడి సమయంలో ట్యాంకర్ నిండా చమురు ఉండడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ చమురు సముద్ర జలాల్లో కలిసే ప్రమాదం ఉందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రెస్క్యూ సిబ్బంది అత్యంత కష్టంమ్మీద మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.  ఈ దాడి ఘటనను దుబాయ్ అధికారులు కూడా ధృవీకరించారు.