22 March, 2026 | 2:23 AM

డిగో గార్సియాపై ఇరాన్ దాడి

22-03-2026 12:45 AM
  1. హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్ స్థావరంపైకి రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
  2. ఒకటి మార్గమధ్యంలోనే విఫలం, రెండో దానిని అడ్డుకున్న అమెరికా నౌకాదళం
  3. టెహ్రాన్ నుంచి 4 వేల కి.మీ దూరంలో ‘డిగో గార్సియా’
  4. అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్
  5. డిగో గార్సియాను సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికా, బ్రిటన్
  6. ఇరాన్ టార్గెట్‌లో యూఎస్ అత్యంత వ్యూహాత్మక స్థావరాలు
  7. తమ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఇరాన్

* హిందూ మహాసముద్రంలోని అమెరికా సైనిక స్థావరం డిగో గార్సియాపై శనివారం ఇరాన్ అత్యంత శక్తిమంతమైన క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా ఊహించని రీతిలో ఈ అనూహ్య దాడి జరిగింది. సుమారు 4,000 కిలోమీటర్ల దూరం నుంచి ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. టెహ్రాన్ వద్ద ఉన్న ఈ రహస్య యుద్ధ సామర్థ్యం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఇంతటి సుదీర్ఘ శ్రేణి క్షిపణులు ఆ దేశం వద్ద ఉన్నాయని శత్రుదేశాలు అంచనా వేయలేకపోయాయి.

తాజా దాడితో పశ్చిమాసియా యుద్ధం ఒక్కసారిగా హిందూ మహాసముద్రం వైపు మళ్లింది. అమెరికా వ్యూహాత్మక కేంద్రమే లక్ష్యంగా క్షిపణులు దూసుకురావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ సాహసానికి ఒడిగట్టింది. తన అమ్ములపొదిలోని అప్రకటిత అస్త్రాలను ఇరాన్ బయటకు తీసింది. ప్రస్తుత పరిణామాలు గల్ఫ్ దేశాల్లో సరికొత్త భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.

అగ్రరాజ్యం తన తదుపరి అడుగు ఏంటనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీ యాంశమైంది. మరోవైపు, ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా దళాలు వైమానిక దాడులు చేశాయి. టెహ్రాన్ నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కేంద్రంపై బాంబుల వర్షం కురిసింది. దాడి తర్వాత ఎలాంటి రేడియోధార్మిక పదార్థాల లీకేజీ జరగలేదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది..

పరిసర ప్రాంత నివాసులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని స్థానిక మీడియా వెల్లడించింది. దాడులను ఇరాన్ అణు ఇంధన సంస్థ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ చట్టాలను అమెరికా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నదని, ఇది బాధ్యతారాహిత్య దాడి అంటూ రష్యా మండిపడింది. అగ్రరాజ్యాల బాధ్యతారాహిత్య దాడుల వల్ల ప్రపంచానికి పెను విపత్తు పొంచి ఉందని హెచ్చరించింది.  

టెహ్రాన్/వాషింగ్టన్, మార్చి 21: టెహ్రాన్ నుంచి 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా-బ్రిటన్ స్థావరం డిగో గార్సియాపై రెండు మధ్యశ్రేణి క్షిపణులతో దాడి చేయడానికి ఇరాన్ ప్రయత్నించింది. వాటిలో ఒకటి విఫలం కాగా, మరొకటిని అమెరికా నౌకాదళం అడ్డుకున్నది. అమెరికా, బ్రిటన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ డిగో గార్సియాపై ఈ దాడితో అమెరికాకు ఇరాన్ భారీషాక్ ఇచ్చింది.

అంతేకాదు ఇరాన్ టార్గెట్‌లో యూఎస్ అత్యంత వ్యూహాత్మక స్థావరాలు ఉండడంతోపాటు తమ సైనిక సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది. తమ క్షిపణి పరిధి 2000 వేల కిలోమీటర్లు కాదని, అది నాలుగు వేల కి.మీ అని చెప్పకనే చెప్పింది. దీంతో శుత్రు దేశాలే కాదు.. యావత్తు ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది.

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న వార్ వల్ల పశ్చిమాసియా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత ఉధృతమవుతున్నాయి. తమతమ సైనిక బలగాలను రోజురోజుకూ మోహరిస్తూ క్షిపణులు, డ్రోన్ల ద్వారా గల్ఫ్‌దేశాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ తన సైనిక సామ ర్థ్యాన్ని ప్రపంచానికి చాటేలా అమెరికాకు చెం దిన అత్యంత వ్యూహాత్మక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

ముఖ్యంగా హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా సైనిక స్థావరంపై ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి, యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అమెరికా, బ్రిటన్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ స్థావరంపై దాడియత్నం ఇరాన్ సైనిక, క్షిపణి శక్తి పరిధిని ప్రపంచానికి చాటిచెప్పింది. అమెరికా రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులలో ఒకటి సాంకేతిక కారణాలతో మార్గమధ్యంలోనే విఫలమవ్వగా, రెండో దానిని అమెరికా నౌకాదళం తన అధునాతన ఎస్‌ఎమ్-3 ఇంటర్‌సెప్టర్ ద్వారా అడ్డుకుంది.

ఈ ఎస్‌ఎమ్-3 క్షిపణికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో ఎలాంటి పేలుడు పదా ర్థాలు ఉండవు. ఇది లక్ష్యాన్ని నేరుగా అత్యంత వేగంతో ఢీకొట్టి నాశనం చేసే ‘హిట్-టు-కిల్’ సాంకేతికతతో పనిచేస్తుంది. గంటకు 600 మైళ్ల వేగంతో ప్రయాణించే పది టన్నుల ట్రక్కు కలిగించేంతటి విధ్వంసక శక్తిని ఇది ఉత్పత్తి చేస్తుంది. ఈ దాడి ప్రయత్నం రక్షణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఎందుకంటే ఇరాన్ ఇప్పటివరకు తన క్షిపణి పరిధి కేవలం 2 వేల కిలోమీటర్లు మాత్రమేనని చెబుతూ వచ్చింది. కానీ, ఇరాన్ నుంచి సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గార్సియాను లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే.. ఆ దేశం తన నిజమైన సైనిక శక్తిని  ప్రపంచానికి ఇప్పటి వరకు తెలియకుండా దాచి ఉంచిందని అర్థమవుతోంది. ఇది పశ్చి మ దేశాల భద్రతా వ్యూహాలను పునఃసమీక్షించుకునేలా చేస్తోంది. 

చర్చలకు అవకాశం ఉన్నప్పటికీ..

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి కాల్పుల విరమణకు మొగ్గు చూపడం లేదు. చర్చలకు అవకాశం ఉన్నప్పటికీ.. యుద్ధం మధ్యలో వెనక్కి తగ్గడం సరైనది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడం, ఆ దేశ క్షిపణి, రక్షణ మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం అమెరికా రక్షణ సంస్థలు తమ క్షిపణి ఉత్పత్తిని రెండు నుంచి నాలుగు రెట్లు పెంచుతున్నాయి.

ఇరా న్ కూడా తన వైఖరిని కఠినతరం చేస్తూనే ఉం ది. ఒకవేళ యుద్ధం తీవ్రమైతే.. దాని ప్రభావం కేవలం మధ్య ఆసియాకే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శత్రువుల పర్యాటక ప్రదేశాలు, బహిరంగ స్థలాలు కూడా సురక్షి తం కాదని ఇరాన్ జనరల్ అబోల్ఫజల్ షెకర్చి హెచ్చరించారు. ఇప్పటికే కువైట్‌లోని అతిపెద్ద రిఫైనరీపై డ్రోన్ దాడులు జరగడం.. యూఏఈకి హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంటే ఇరాన్ ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతోందని తెలుస్తోంది.

బ్రిటన్ తన స్థావరాలను అమెరికాకు ఇవ్వడాన్ని కూడా ఇరాన్ తప్పుబడుతోంది. ఇక ఇరాన్ కొంత వ్యూహాత్మక వెసులుబాటును కూడా ప్రదర్శిస్తోంది. హార్ము జ్ జలసంధి గుండా జపాన్ నౌకలను అనుమతిస్తామని చెప్పడం ద్వారా, తనకు కావా ల్సిన దేశాలతో సంబంధాలను కాపాడుకుంటూనే.. అమెరికా కూటమిపై ఒత్తిడి పెంచు తోంది. అయితే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యా హు మాత్రం ఇరాన్ సైనిక శక్తిని తాము ఇప్పటికే భారీగా దెబ్బతీశామని, వారి ఆయుధ కర్మాగారాలే తమ తదుపరి లక్ష్యమని ప్రకటించారు. ఈ పరిణామాలు పశ్చిమాసియాను భీకర పరిస్థితుల్లోకి తోసేస్తున్నాయి. 

హిందూ మహాసముద్రంలో అమెరికా-బ్రిటన్ వ్యూహాత్మక కేంద్రం

డిగో గార్సియా, భారీ బాంబర్లు, నిఘావిమానాలు, కీలకమైన లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలకు ఆతిథ్యం ఇస్తూ, అమెరికా శక్తి ప్రదర్శనకు ఒక కీలకమైన వేదికగా ఉంది. హిందూమహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగో స్. ఇందులో అతిపెద్దదే డిగో గార్సియా. ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కార్యకలాపాల కోసం అమెరికా దీనిని ప్రధానంగా ఉపయోగిస్తుంది. అయితీ ఈ స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి ప్రయత్నం అమెరికాకు షాక్ తగిలింది.