రేపు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల
ముంబై, మార్చి 10 : టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసిపోవడంతో అభిమానులు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియన్ ప్రీయినర్ లీగ్ 19వ సీజన్‌కు ఇంకా కొద్దిరోజులే మిగిలి ఉంది. అయితే ఇప్పటి వరకూ బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. తాజాగా దీనికి సంబంధించి బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా కీలక ప్రకటన చేశారు. మార్చి 12న ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తొలి 20 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తామని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడంతో ఈ సారి ఐపీఎల్ షెడ్యూల్ విడుదల ఆలస్యమైంది.
తమిళనాడు, బెంగాల్, అసోంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ తేదీలతో లీగ్ షెడ్యూల్ క్లాష్ కాకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంటోంది.ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. తమ ప్లేయర్స్‌తో ట్రైనింగ్ క్యాం పులు కూడా మొదలుపెట్టేశాయి. కాగా ఐపీఎల్ మార్చి 28 నుంచి మే 31 వరకూ దేశవ్యాప్తంగా 14 వేదికల్లో జరగనుంది.




