బోనాలకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఈవో మనోహర్ రెడ్డి
ముషీరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం కమిటీ సభ్యుడు దేవివరప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ను కలిసి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆహ్వాన కార్డును అందజేసి సన్మానించారు.
ఈనెల 26,27 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయించారని, వైభవంగా నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో సికింద్రా బాద్ ఉజ్జయిని మహాంకాళి దేవాలయ కమిటీ ఈవో మనోహర్ రెడ్డి, కమిటీ సభ్యులు దేవి వరప్రసాద్, డాక్టర్ శివలాల్, మల్లికార్జున్, రాజేందర్, ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.






