1 March, 2026 | 9:58 PM

టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ

01-03-2026 07:19 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో టేబుల్ క్యాలెండర్ ను కరీంనగర్ లో మహాత్మ జ్యోతిబాపూలే మైదానంలో బీసీ సంక్షేమ  సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరుశురాం గౌడ్, జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ఆదివారం రోజున ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఈ జ్యోతి బాపులే మైదానంలో జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు నెలకొల్పాలని అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్,

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు పళ్ళుమార్లు వినతి పత్రం ఇచ్చిన కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్టుగా వినతి పత్రం చెత్తకుండీలకే పరిమితమే తప్ప రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా కొత్తగా ఎన్నుకోబడిన మునిసిపల్ మేయర్ ఈ జ్యోతిబాపూలే మైదానంలో ఆది దంపతుల విగ్రహాలు  నెలకొల్పాలని  పత్రికా ముఖంగా విన్నవించుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాదాసు సంజీవ్, జిల్లా కార్యదర్శి వాయిల రాజకుమార్, ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, దుప్పటిపల్లి మురళి, యువజన సంఘం పట్టణ అధ్యక్షులు కాసరాజు, విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బోయిని ప్రశాంత్, కొత్తపల్లి మండల అధ్యక్షులు పిసర రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కుంట చంద్రయ్య, ఆశిష్ గౌడ్ పురుషోత్తం తోపాటు బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.