ఎన్సీసీ ఆధ్వర్యంలో యోగ దినోత్సవం
21-06-2026 05:08 PM
పాపన్నపేట: మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ అధికారి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు రకరకాల యోగాసనాలు వేశారు. శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగ ఒక గొప్ప మార్గమని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.






