చింతల బోరి చెరువులో విచ్చలవిడిగా మొరం తవ్వకాలు
21-06-2026 05:15 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని చింతలపూడి చెరువులో అక్రమమురం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి అడ్డగోలుగా మొరం తవ్వకాలు జరిపి విక్రాలు చేస్తున్నారని గ్రామ సర్పంచ్ గైక్వాడ్ శ్రీరామ్ పేర్కొన్నారు. అక్రమమరం తవ్వకాలను నిలిపివేయాలని ఎంత చెప్పినా జెసిపి యజమాని పట్టించుకోకుండా మొరం తవ్వకాలు జరుపుకున్నారు. మొరం తవ్వ గల వల్ల సమీప భవిష్యత్తులో గ్రామస్తులకు అవసరం అయినప్పుడు మొరం దొరకకుండా పోతుందన్నారు. ఈ విషయం అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని బాధ్యులపై కేసు నమోదు చేయాలని కోరారు.






