5 May, 2026 | 1:54 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

08-03-2026 12:08 AM

స్టెమ్స్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో ఘనంగా నిర్వహణ

ఖమ్మం, మార్చి 7 (విజయక్రాంతి): ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీలోని స్టెమ్స్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్కూల్ డైరెక్టర్ కొండా కృష్ణవేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా, సంప్రదాయంగా, రాజకీయంగా ఎన్నో అవరోదాలను అధిగమించి వారు పొందిన అద్భుతమైన నైపుణ్యాలను, విజయాలకు సూచికగా ప్రతి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు.

మహిళా సాధికారతే దేశాభివృద్ధి అని మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ సిరి సంపదలు, విజయాలు సిద్ధిస్తాయని తెలియజేశారు.నేటి బాలికలు కూడా ఆదర్శ మహిళల దారిలో నడిచి పోటి ప్రపంచంలో నిలవాలని విద్యార్థుల్లో స్పూర్తిని నింపారు. అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.స్కూల్ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ సృష్ఠికి మూలం స్త్రీ.. మహిళలను గౌరవించడం అందరి విధి అని సావిత్రిబాయి పూలె, మదర్ థెరిస్సా, మలాల యూసఫ్ జాయ్, కల్పనా చావ్లా వంటి ఎందరో మహిళలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు.

స్టెమ్స్‌స్పార్క్ రెజొనెన్స్ శ్రీనగర్ స్కూల్‌లో బాలికలు ఆత్మ విశ్వాసం, పోటీతత్వం కలిగి ఉండాలంటూ అన్ని రంగాల్లోతీర్చిదిద్దాడానికి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. బాలికలను తిరుగులేని శక్తులుగా మారుస్తామని తెలియజేస్తూ అన్ని రంగాల్లో మహిళా సాధికారత సాధించాలని ఆశిస్తూ మహిళలందరికి జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్‌లోని మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.