10 April, 2026 | 3:59 AM

12 లేదా 13న ఇంటర్ ఫలితాలు!

10-04-2026 12:39 AM

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాం తి): ఇంటర్ ఫలితాలు ఈ నెల 12న లే దా 13న ప్రకటించే అవకాశముంది. ఈ రెండు తేదీల్లో ఎప్పుడైనా ఫలితాలను ప్రకటించుకోవాలని ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా ఇంటర్ బోర్డులోని ఓ అధికారి తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తమిళనాడు రాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయన 12 లేదా 13న ఎప్పుడొస్తే అప్పుడు ఫలితాలను విడుదల చేసుకునే అవకాశ ముందని ఓ అధికారి పేర్కొన్నారు.