30 August, 2026 | 3:59 AM

భయపెట్టేందుకు వస్తోందా?

30-08-2026 12:51 AM

డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఇప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా ‘కొరియన్ కనకరాజు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలావుండగా, మేర్లపాక గాంధీ ఇప్పటికే తన తదుపరి సినిమాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆయన తన తర్వాతి మూవీని బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్నూతో చేయబోతున్నట్లు సమాచారం. హారర్ జానర్‌లో తెరకెక్కబోతున్నారని, ఈ విషయమై తాప్సీని సంప్రదించిన దర్శకుడు గాంధీ.. ఓ కథను వినిపించగా, ఆమె కూడా పచ్చ జెండా ఊపిందని టాక్. ఇప్పటివరకు కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మేర్లపాక గాంధీ తొలిసారి హారర్ సినిమా చేయబోతున్నారనే వార్తలు రావడంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.