నల్ల పోచమ్మకు బోనాలు
19-07-2026 12:10 PM
పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని నల్ల పోచమ్మకు బోనాలు సమర్పించిన విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం.
బోథ్, జులై 19 (విజయక్రాంతి): ప్రజలంతా సుఖశాంతులతో ఉండి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ మండల కేంద్రంలోని విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మకు ఆదివారం బోనాలు సమర్పించారు. ఆదివారం ఉదయం అధ్యక్షులు రంగు రాజు ఆధ్వర్యంలో బోనాలు సమర్పించుకున్నారు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడిచర్ల ప్రవీణ్ మాజీ అధ్యక్షులు పాలిక రమేష్ రిటైర్డ్ ఉపాధ్యాయులు రఘుపతి ప్రసాద్ లక్ష్మణ్ శంకర్ సాగర్ రూపేష్ పాపేశ్వర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు






