19 July, 2026 | 8:52 PM

పదవి కాదు.. ప్రజాసేవే ముఖ్యమంటున్న ప్రభు దయాల్

19-07-2026 01:08 PM

 సర్వీస్ రిజిస్టర్ లోనే ప్రశంసల జల్లు..

 కొత్తగూడెం జూలై 19 విజయక్రాంతి: పేరులో "నే "ముంది కొందరి పేర్లలోనే నేముంటుందని, మన తల్లిదండ్రులు సమయోచితంగా ఆయాచితంగా పేర్లు పెట్టిననూ, దానిని సార్ధకం చేసే వ్యక్తులుంటారని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. భద్రాచలం ఐటీడీఏ బీఈడీ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ గా నాడు కళాశాలను ఉన్నతంగా తీర్చిదిద్ది జాతీయ ఉపాధ్యాయ మండలి న్యూఢిల్లీ, ప్రత్యేక గుర్తింపును సాధించిన డాక్టర్ ప్రభుదయాల్ పేరుకు తగ్గట్టు నిజాయితీగా గిరిజనుల సంక్షేమార్థం పనిచేశారని ఆయన పేర్కొన్నారు.

ఇటీవలే కొత్తగూడెం ఎంఈఓ గా పదవీ విరమణ చేసి, మండలాన్ని రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో ఉంచి, ప్రభుత్వం చే ప్రత్యేకంగా గుర్తించబడ్డారని, బీదల పట్ల ఆయన చూపే దయ గొప్పదని ఈ విషయంలో తన పేరును సార్ధకం చేస్తున్నారని పూర్వ కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అవసరత ఉన్న వారి పట్ల అప్పటికప్పుడు స్పందిస్తారంటూ ఆయన సర్వీస్ రిజిస్టర్ లోనే రికార్డు చేశారు. డాక్టర్ దయాల్ పదవీ విరమణ చేసిన తన శక్తి పరిధి మేర తగు తోడ్పాటునందిస్తున్నారు. బీదలకు వస్త్రాలు, ఆహార పదార్థాలు, విద్యార్థులకు పుస్తకాలు ఇలా చేయూత నిస్తున్నారు. ఆయన పనితీరు పట్ల పలువురు ఐఏఎస్(IAS)  అధికారులు ఆయన సర్వీసు రిజిస్టర్ లోనే ప్రశంసలు రికార్డు చేయడం అత్యంత అరుదైన విషయం. ఇల్లందులో జన్మించి కొత్తగూడెంలో సెటిల్ అయిన దయాల్ జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేయడం భద్రాద్రి జిల్లాకే మణిహారం.