26 February, 2026 | 1:01 AM

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

25-02-2026 09:06 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కాగా ఈ పరీక్షలకు 239 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా తొలిరోజే ముగ్గురు విద్యార్థులు గైరాజరు అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ చిన్యా తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఎస్ఐ మేడా ప్రసాద్ పరిశీలించారు. పరీక్ష కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.