ఎన్ఎంఎంఎస్ ప్రొవిజినల్ ఫలితాలలో కూసుమంచి విద్యార్థుల ప్రతిభ
25-02-2026 09:03 PM
కూసుమంచి,(విజయక్రాంతి): ఎన్ఎంఎంఎస్-2026 ప్రోవిజనల్ ఫలితాల్లో కూసుమంచి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఓపెన్ కేటగిరిలో జస్వంత్ కుమార్, కిరణ్ కుమార్, ఈశ్వర్, కుమార్, గౌతమ్ కుమార్ ఎంపికైనట్లుగా మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరస్వామి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందనలు తెలియజేశారు.




