2 June, 2026 | 2:58 AM

ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

02-06-2026 02:10 AM

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్

కొల్లాపూర్ రూరల్, జూన్ 1: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. సోమవారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి  పాటిల్ కలిసి సోమశిల, నర్లపూర్ ప్రాంతాలను సందర్శించి భద్రత, బస, హెలిప్యాడ్, సమీక్షా సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు.

సోమశిలలోని హరిత గెస్ట్ హౌస్లో సీఎం బస, సమావేశ మందిరాలు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్య ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్, అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం నార్లాపూర్లోని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను పరిశీలించి, సందర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్బీ శాఖల అధికారులు పాల్గొన్నారు.