2 June, 2026 | 2:58 AM

నేడు ‘ప్రజా పాలన ప్రగతి నివేదిక’ బస్సు యాత్ర ప్రారంభం

02-06-2026 02:07 AM

అలంపూర్, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న ‘ప్రజా పాలనప్రగతి నివేదిక’ బస్సు యాత్ర జూన్ 2న మంగళవారం అలంపూర్లో  ప్రారంభించనున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ యాత్రను నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రారంభించనున్నారు. జూన్ 2 మధ్యాహ్నం 1 గంటకు జోగులాంబ వద్ద అమ్మవారి దర్శనం, వాహన పూజ అనంతరం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది.

నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో తొలి మూడు రోజులు (జూన్ 2, 3, 4) అలంపూర్ నియోజకవర్గంలో, తదుపరి మూడు రోజులు గద్వాల్ నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ మాట్లాడు తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.