వెయ్యి రూపాయల ఇన్సూరెన్స్ తో 20 లక్షల బీమా చెల్లింపు
మృతి చెందిన కుటుంబానికి 20 లక్షల చెక్కు అందిస్తున్న మేనేజర్ సర్పంచ్
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని కోట కె గ్రామానికి చెందిన సురేందర్ కేంద్రీ మృతి చెందడంతో ఆయన కుటుంబానికి బుధవారం సోనాల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ వినోద్ భార్గవి గ్రామ సర్పంచ్ పూజా సంఘం చేతుల మీదుగా 20 లక్షల రూపాయల చెక్కును అందించారు. మృతుడు దక్కన్ గ్రామీణ బ్యాంకులో వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించడం జరిగింది. దీంతో మృతుని భార్య వసుంధర బాయ్ కి 20 లక్షల చెక్కును అందించారు ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ గిర్మోజి నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గ్రామీణ బ్యాంకులో కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాలసీ చేయించుకోవాలని కోరారు కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ జి నందు రెడ్డి అకౌంటెంట్ రమేష్ క్యాషియర్ ఎం రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు






