20 April, 2026 | 12:03 AM

ఇన్‌స్టామార్ట్ ,కళ్యాణ్ జ్యువెలర్స్ భాగస్వామ్యం

19-04-2026 09:58 PM

హైదరాబాద్, 18 ఏప్రిల్ 2026: ఈ అక్షయ తృతీయ వేళ, మారుతున్న ధరలతో సంబంధం లేకుండా బంగారం కొనుగోలుదారులు ముందుగానే ప్రణాళిక చేసుకోవడాన్ని నగల వ్యాపారులు సులభతరం చేస్తున్నారు. భారతదేశపు అగ్రగామి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టామార్ట్, కళ్యాణ్ జ్యువెలర్స్‌తో భాగస్వామ్యం చేసుకుని 'గోల్డ్ రేట్ ప్రొటెక్షన్' అనే ఒక వినూత్నమైన సదుపాయాన్ని అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు నేటి బంగారం ధరను లాక్ చేసుకుని, అక్షయ తృతీయ రోజున, లాక్-ఇన్ ధర లేదా ఆ రోజు మార్కెట్ ధర - ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే ఆ ధరకు కొనుగోలు చేయవచ్చు.

సంపద మరియు శుభారంభాలకు ప్రతీక అయిన అక్షయ తృతీయ సమయంలో బంగారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంటుంది. పండుగకు ముందు వినియోగదారులు తమ కొనుగోళ్లకు ప్రణాళిక చేసుకునేటప్పుడు సౌలభ్యం, భరోసా రెండూ సమానంగా ముఖ్యమవుతాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ నుండి బిఐఎస్ హాల్‌మార్క్ ఉన్న బంగారు నాణేలను ఆర్డర్ చేసే వినియోగదారులకు ఇన్‌స్టామార్ట్ యొక్క 'గోల్డ్ రేట్ ప్రొటెక్షన్' సదుపాయం సౌకర్యవంతంగా మరియు భరోసా కల్పించే రీతిలోనూ ఉంటుంది.

ఇన్‌స్టామార్ట్ యాప్‌లో అర్హత కలిగిన కళ్యాణ్ జ్యువెలర్స్ బంగారు నాణేలను ఎంచుకుని, అక్షయ తృతీయ నాడు డెలివరీ పొందేందుకు గాను 0.5 గ్రాముల బంగారు నాణెం కోసం 5% అడ్వాన్స్, (రూ. 500 నుండి ప్రారంభమవుతుంది) చెల్లించి ముందుగా బుక్ చేసుకోవచ్చు. తద్వారా, ఏప్రిల్ 19న, ఉదయం 8:00 నుండి రాత్రి 12:00 గంటల మధ్య (భారతీయ కాలమానం), వారు ప్రీ-బుకింగ్ చేసిన రోజు నాటి బంగారు ధర లేదా డెలివరీ తేదీ నాటి ధర, ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరకు తమ కొనుగోలును పూర్తి చేసుకోవచ్చు. ప్రీ-బుక్ చేసుకున్న వినియోగదారులందరికీ కళ్యాణ్ జ్యువెలర్స్ నుండి ఒక ఉచిత వెండి నాణెం కూడా లభిస్తుంది. 

ఇన్‌స్టామార్ట్, వైస్ ప్రెసిడెంట్ గ్రోత్,అర్జున్ చౌదరి మాట్లాడుతూ ఇన్‌స్టామార్ట్‌ వద్ద ధంతేరస్ సమయంలో 1 కేజీ వెండి బ్రిక్స్  డెలివరీ చేయడం నుండి రక్షాబంధన్ కోసం వెండి రాఖీలను పరిచయం చేయటం వరకు, ముఖ్యమైన సందర్భాలలో భారతీయులు విలువైన లోహాలను కొనుగోలు చేసే విధానంలో తాము నిరంతరం కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ కళ్యాణ్ జ్యువెలర్స్ రిటైల్ షోరూమ్‌లన్నింటిలోనూ 'గోల్డ్ రేట్ ప్రొటెక్షన్' ఒక ప్రాధాన్యత కలిగిన ఫీచర్‌గా ఉందన్నారు ఇది పండుగ కొనుగోళ్లను ప్రణాళిక చేసుకునేటప్పుడు వినియోగదారులకు మరింత భరోసాను అందిస్తుందని తెలిపారు.