మహోన్నత దైవం సేవలాల్
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
వైభవంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన
షాద్‌నగర్,(విజయక్రాంతి): తన సేవలతో.. తన అడుగులతో గిరిజన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయిన అరుదైన దైవం, ఆధ్యాత్మిక వైభవం సేవాలాల్ మహారాజ్ అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. శనివారం పట్టణంలోని టీచర్స్ కాలనీలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన, పరివార దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని శనివారం గిరిజనులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూజా కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని ఉదయం 8 గంటలకు ప్రాతః కాల పూజలు, మహాత్మా వనము, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, పూర్ణకుంభ నివేదన, వేద ఆశీర్వచనము తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గిరిజన జాతిని రక్షించేందుకు, వారికి సేవలు అందించేందుకు, చైతన్యం తీసుకువచ్చేందుకు సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి అనిర్వచనీయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అందుకే ఆయన గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలవబడుతున్నాడని ప్రశంసించారు.
అలాంటి మహనీయుడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, వారికి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా విజయవంతంగా పూర్తి కావడానికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సంధర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మట్లాడుతూ... తన బోధనల ద్వారా బంజారాలను సన్మార్గంలో నడిపించేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రజా శ్రే యస్సు కోసం అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా గిరిజనులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు స్థానిక చౌరస్తాలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆటపాటలతో గిరిజన ప్రత్యేక నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంగనూర్ బసవేశ్వర్, అందె మోహన్, గిరిజన నేత దాస్ రామ్ నాయక్, సిపిఎం నేత రాజు, సిపిఐ శీను నాయక్, మిట్టు నాయక్, ఏసీపి రాములు నాయక్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, గోపాల్ నాయక్, మంగు నాయక్, రమావత్ రాజు, ఈశ్వర్ నాయక్, శ్రీను నాయక్, రఘునాయక్, బుజ్జిబాబు నాయక్, పవన్ చౌహన్, బాబు నాయక్ బాలు నాయక్ నారాయణ కిషన్ నాయక్ ఎడి రాంసింగ్, కౌన్సిలర్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.




