తొలగిన చీకటి
ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై లైట్లు ఏర్పాటు
కేసముద్రం, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఎట్టకేలకు కేసముద్రం పట్టణ కేం ద్రంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై వీధిలైట్లు ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పాటుచేసిన వీధిలైట్లు ఒకవైపు కేసముద్రం స్టేషన్, మరోవైపు కేసముద్రం విలేజ్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేవి. వీటి నిర్వహణను కూడా ఆయా పంచాయతీలు చూసుకునేవి. కేసముద్రంలో దశాబ్ద కాలం క్రితం నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ప్రత్యేకంగా ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.
అయితే కొంతకాలం తర్వాత లైట్లు కొన్ని వెలగకపోవడం, కొన్ని ప్రమాదం జరిగి స్తంభాలు కింద ఒరిగిపోవ డం వల్ల లైట్ల నిర్వహణ కూడా ఆయా పం చాయతీలకు భారంగా మారడంతో వాటిని పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ఈ క్రమంలో ఇరు పంచాయతీలను విలీనం చేసి కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి చొరవతో కేసముద్రం పట్టణానికి ప్రత్యేకంగా వీధిలైట్ల పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఇందులో భాగంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై అత్యంత ప్రకాశవంతంగా వెలుతురు నిచ్చే 110 వోల్టుల 42 ఎల్ ఈ డీ లైట్లను ఏర్పాటు చేయించారు. ఫ్లై ఓవర్ వంతెన పై కొత్తగా ఎల్‌ఈడి లైట్లు అమర్చడానికి ప్రత్యేకంగా క్రేన్ తో కూడిన వాహనాన్ని తెప్పించారు. రెండు రోజుల నుండి పాడైపోయిన లైట్లు పూర్తిగా తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ‘చీకటి’ సమస్య తొలిగిపోయింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఇప్పుడు రాత్రి పూట దేదీప్య ప్రమాణంగా వెలుగులు విరజిమ్ముతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ప్రమాదాలకు చెక్
రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై వీధిలైట్లు వెలగకపోవడం వల్ల తరచుగా ప్రమాదా లు జరిగేవి. పలుసార్లు వీధిలైట్ల స మస్యపై పంచాయతీ అధికారులకు, అ ప్పటి ప్రజాప్రతినిధులకు వివరించినా నిధుల లేమి కారణంగా వాటిని పట్టించుకోలేదు. పంచాయతీలకు కూడా కొ త్తగా వీధిలైట్లను ఏర్పాటు చేయడం భారంగా మారిందని చెప్పి చేతులు దులుపుకునే పరిస్థితి ఉండేది.
ఇప్పుడు వేం న రేందర్ రెడ్డి సహకారంతో పట్టణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా కేసముద్రం పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై లైట్లను పూర్తిగా వెలిగించే విధంగా చర్యలు తీసుకోవడంతో ఇక ప్రమాదాలు చోటు చే సుకునే అవకాశం లేకపోగా, రాత్రిపూట ఫ్లై ఓవర్ పై నిర్భయంగా ప్రజలు రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడింది.
పోకల శ్రీనివాస్, అమీనాపురం




