7 July, 2026 | 9:26 PM

పుట్టినరోజు.. దివ్యాంగులకు అన్నదానం

07-07-2026 08:17 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం దివ్యాంగుల పునరావాస కేంద్రంలోని దివ్యాంగులకు ఉల్లెంగల  నిర్మల జన్మదినాన్ని పురస్కరించుకొనిమంగళవారం చికెన్ బిర్యానితో భోజనం ఏర్పాటు చేశారు. సెంటర్లోని దివ్యాంగులు నిర్మలకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్మల భర్త శ్రీనివాస్, కుమారుడు ఉదయ్ లు మాట్లాడుతూ జన్మదినాన్ని పురస్కరించుకొని దివ్యాంగులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం ఎం, రాజేంద్రప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ మంద శ్రీనివాస్ గౌడ్, ఆరేపల్లి సర్వేశ్, సెంటర్ నిర్వాహకులు పలువురు ఉన్నారు.