1 July, 2026 | 10:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఎయిర్‌టెల్ టవర్ ఏర్పాటు నిలిపివేత

15-04-2026 12:28 AM

కాలనీ ప్రజలకు ఉపశమనం

నాగోల్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): కొత్తపేట డివిజన్ పరిధిలోని సత్యనగర్ కాలనీలో కొత్తగా ఎయిర్టెల్ టవర్ ఏర్పాటు జరుగుతున్నట్లు గమనించిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వెంటనే డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ కు సమాచారం అందించారు. ఈ సమాచారంపై స్పందించిన పవన్ కుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

చర్చల అనంతరం ఇంటి యజమాని టవర్ ఏర్పాటు నిలిపివేయడానికి అంగీకరించారు. ఈ పరిణామంతో సత్యనగర్ కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు నాయకోటి పవన్ కుమార్‌కు ప్రజలందరూ కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.