21 July, 2026 | 5:31 PM

రాష్ట్రంలో డీమ్డ్‌ యూనివర్సిటీల్లో తనిఖీలు

21-07-2026 11:46 AM

హైదరాబాద్: రాష్ట్రంలో డీమ్డ్‌ యూనివర్సిటీల్లో తనిఖీలు(Deemed Universities Inspections) కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా డీమ్డ్‌ వర్సిటీల పనితీరు, ఆడిట్స్ సహా అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు(Supreme Court) ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో తనిఖీలు నిర్వహిస్తోంది. అయేషా జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో(Ayesha Jain vs. Union of India case) సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ వేసింది. ఈనెల 24 లోపు తనిఖీలు పూర్తి చేసి కమిటీ నివేదిక సమర్పించనుంది.