21 July, 2026 | 6:21 PM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం.. బారులు తీరిన భక్తులు

21-07-2026 12:45 PM

హైదరాబాద్: బల్కంపేటలో(Balkampet) మంగళవారం నాడు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 11.59 గంటలకు బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం(Balkampet Ellamma Kalyanotsavam) జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చారు. భారీగా వస్తున్న భక్తుల కోసం 7 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయానికి దారితీసే వీధులు, సందులు ఎల్‌ఈడీ (LED) లైట్లు, రంగురంగుల పూలతో అలంకరించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బల్కంపేట, పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకాగలిగిన వారికి దీని ప్రత్యక్ష ప్రసార సదుపాయం కూడా కల్పించారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం, దేవాదాయ, పోలీసు శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు బల్కంపేట అమ్మవారి రథోత్సవం వైభవంగా జరనుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత, ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు(CM Revanth Reddy family members), మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం.. ట్రాఫిక్ ఆంక్షలు జారీ

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) విధించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఆర్ అండ్ బీ ఆఫీస్, జీహెచ్ఎంసీ గ్రౌండ్, నేచర్ క్యూర్ ఆస్పత్రి వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.